ఇంగ్లాండ్ తో మొతెరా క్రికెట్ మైదానంలో జరిగిన మూడో టెస్టులో టీమిండియా స్పిన్నర్ అక్షర్ పటేల్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఒక డే/నైట్(పింక్ బాల్) టెస్టులో అత్యధిక వికెట్లు(11/70) తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.
ఈ టెస్టులో అక్షర్ 11 వికెట్లు పడగొట్టాడు. అక్షర్ తర్వాత స్థానాల్లో కమ్మిన్స్ (10/62), విండీస్ స్పిన్నర్ దేవేంద్ర బిషో(10/174) ఉన్నారు. అటు ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసిన ఏడో బౌలర్గా అక్షర్ నిలిచాడు.