తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ ,కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు.వచ్చే నెల మార్చి పద్నాలుగో తారీఖున ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి, హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా దివంగత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు తనయ సురభి వాణీదేవి బరిలోకిదిగుతున్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్ లో జరిగిన ఉమ్మడి హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల పార్టీ నేతల సమావేశంలో మాట్లాడుతూ”ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్,బీజేపీ నేతలకు ఓట్లు అడిగే హక్కు లేదు. ఉమ్మడి రాష్ట్రంలో చివరి పదేళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కనీసం పదివేల ఉద్యోగాలైన ఇచ్చాయా అనిఆయన ప్రశ్నించారు. అరవై ఏండ్లు తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్. కోట్లాడింది ఆ పార్టీపైనే. ఇప్పుడొచ్చి ఉద్ధారిస్తామని చెబుతుంటే నమ్మడానికి తెలంగాణ ప్రజలు ఏమి అమాయకులు కాదు అని అన్నారు.
గత ఏడేండ్లలో ఒక లక్ష ముప్పై రెండు వేల సర్కారు ఉద్యోగాలను తమ ప్రభుత్వం ఇచ్చింది. కావాలంటే బహిరంగ చర్చకు రావాలనిఆయన సవాల్ విసిరారు. ఇక కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీచ్చిన బీజేపీ కనీసం ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోతుందని ఆయన హెద్దేవా చేశారు. జాతీయ నిరుద్యోగ సగటు కంటే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సగటు తక్కువగా ఉందని కావాలంటే వీటిపై చర్చకు రావాలని ఆయన అన్నారు. ముందు గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలపై బీజేపీ దృష్టి పెట్టాలని ఆయన అన్నారు.