ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో పాటుగా మానవ దైనందిన జీవితంలో ఒక భాగమైన వంట గ్యాస్,పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్న సంగతి మనకు తెల్సిందే. ఈ ఒక్క ఫిబ్రవరి నెలలోనే వంట గ్యాస్ సిలిండర్ పై రూ.25లు పెరగడం గమనార్హం.
వీటి గురించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ధరల నియంత్రణ మా చేతుల్లో లేదంటూ తేల్చి చెప్పారు. అయితే తాజాగా ప్రధాన మంత్రి నరేందర్ మోదీ ప్రభుత్వానికి సంబంధించిన నాలుగు సంస్థలు మినహా అన్నింటిని అమ్మేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ” నష్టాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలన్నీంటిని వదిలించుకోక తప్పదు.
అధునీకరించడం.. సంపదను సృష్టించడం మా ప్రభుత్వ నినాదం. దేశంలో భారీ పెట్టుబడులు,ప్రపంచంలోనే అత్యుత్తమ విధానాలను,న్యాణ్యమైన మేనేజర్లను ఆధునీక టెక్నాలజీని తీసుకురావడం ప్రయివేట్ రంగంతోనే సాధ్యమని” ఆయన అన్నారు.వీటిని అమ్మితే రెండు లక్షల కోట్ల నిధులోస్తాయి. వాటన్నింటిని సంక్షేమానికి ఖర్చు చేస్తామని తెలిపారు ప్రధాని మోదీ..