చర్మసౌందర్యాన్ని పెంచుకోవడానికి పైపైన మెరుగులు దిద్దితే సరిపోదు. చర్మపు ఆరోగ్యాన్ని పెంచి, మెరుపును అందించే పదార్థాలకు ఆహారంలో చోటివ్వాలి. ఇందుకు ద్రాక్ష సూపర్ గా తోడ్పడుతుందట.
సూర్యరశ్మిలోని UV కిరణాల నుంచి చర్మానికి రక్షణ కల్పించి.. స్కిన్ డ్యామేజ్ ని నియంత్రించే పాలీఫినాల్స్ అనే సహజసిద్ధ గుణాలు ద్రాక్షలో ఉంటాయని నిపుణులు పేర్కొన్నారు ద్రాక్ష రసాన్ని స్కిన్ లోషన్ గానూ రాసుకోవచ్చని చెబుతున్నారు.