సబ్సిడీ సిలిండర్ ధరలు అమాంతం పెరిగాయి. ఒక్కో గ్యాస్ సిలిండర్ పై రూ.25 చొప్పున పెంచుతూ చమురు సంస్థలు బుధవారం రాత్రి నిర్ణయించాయి. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొన్నాయి.
దీంతో సిలిండర్(14 కేజీల) ధర రూ.846.50కు పెరిగింది. FEBలో మొత్తం మూడు సార్లు గ్యాస్ ధరలు పెరగ్గా.. రూ. 100 మేర భారం పడింది. 4వ తేదీన రూ. 25,15న రూ.50 సహా తాజాగా రూ.25 పెంచడంతో సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపనుంది.