`క్రాక్` విజయంతో ఫామ్‌లోకి వచ్చిన మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో `ఖిలాడి` చేస్తున్నాడు. ఈ సినిమాతో మీనాక్షి చౌదరి తెలుగు తెరకు పరిచయమవుతోంది.
డింపుల్ హయాతి మరో హీరోయిన్‌గా నటిస్తోంది. `ఖిలాడి` తర్వాత రవితేజ నటిస్తున్న చిత్రానికి నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో రవితేజ ఇద్దరు భామలతో ఆడిపాడనున్నాడట.
ఈ సినిమాలో తమిళ భామ ఐశ్వర్యా మీనన్ ఓ కథానాయికగా ఎంపికైనట్టు సమాచారం. అలాగే మరో కథానాయికగా కన్నడ భామ శ్రీలీల నటించనున్నట్టు తెలిసింది. టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.