పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రజాప్రతినిధులతో టీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణ భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి జీహెచ్‌ఎంసీ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మేయర్, డిప్యూటీ మేయర్, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె వాణీదేవి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే