విభిన్న రోల్స్ తో మెప్పించే బాలీవుడ్ నటి కంగనా రనౌత్.. కొత్త అవతారం ఎత్తనుంది. ఈసారి మూవీ కోసం కాకుండా రియల్ వ్యాపారవేత్తగా మారనుంది. హిమాచల్ ప్రదేశ్లోని తన సొంతూరు మనాలిలో ఆమె ఒక కేఫ్, రెస్టారెంట్ ఓపెన్ చేయనుంది.
తన ట్విట్టర్ వేదికగా ఈ విషయం తెలిపింది. ‘ఈ కొత్త వెంచర్ నా కల. సినిమాలు కాకుండా నాకు ఇష్టమైనది ఆహారం అంటూ ఆమె ట్వీట్ చేసింది. ప్రస్తుతం థాకడ్, తేజస్ అనే మూవీల్లో కంగన నటిస్తోంది.