`అఆ` సినిమాతో తెలుగు తెరంగేట్రం చేసింది మలయాళ భామ అనుపమా పరమేశ్వరన్. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించి ప్రతిభ గల నటిగా గుర్తింపు సంపాదించుకుంది. పక్కింటమ్మాయి తరహా పాత్రల్లో నటించి మెప్పించింది.
అయితే కొంత కాలంగా అనుపమకు తెలుగు నుంచి అవకాశాలు తగ్గాయి. గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉండడంతో అనుపమకు పెద్దగా అవకాశాలు రావడం లేదు.

ప్రస్తుతం అనుపమ యంగ్ హీరో నిఖిల్ సరసన `18 పేజెస్`లో నటిస్తోంది. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. నిఖిల్ వల్ల అనుపమకు మరో ఛాన్స్ వచ్చిందట. నిఖిల్ హీరోగా చందు మొండేటి రూపొందిస్తున్న చిత్రం `కార్తికేయ-2`. `కార్తికేయ`కు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా అనుపమను తీసుకున్నారట. ఈ నెల 26 నుంచి ఈ సినిమా షూట్ ప్రారంభం కాబోతోంది.