తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల స్థానానికి టీటీడీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎల్ రమణ పోటీ చేయనున్నారు.
ఈ మేరకు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశమైంది. నల్గొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో మద్దతు అంశంపై అధినేత చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
అయితే హైదరాబాద్ – రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార టీఆర్ఎస్ పార్టీ తరుపున దివంగత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహా రావు తనయ సురభి వాణిదేవి, కాంగ్రెస్ నుంచి జిల్లెల చిన్నారెడ్డి, బీజేపీ పార్టీ నుంచి ఎన్,రాంచందర్ రావు పోటీ చేస్తున్నారు