తెలంగాణలో మార్చి 14న జరగనున్న రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ఎంపిక చేశారు. అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం పీవీ నరసింహారావు కూతురు వాణీ దేవికి ఇవ్వాలని నిర్ణయించారు.
సీఎం కేసీఆర్ ఈ మేరకు ప్రగతి భవన్ లో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. వాణి గెలుపు కోసం శక్తి వంచన లేకుండా ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పారు. సమావేశం అనంతరం ఆమెకు బీ ఫారం అందజేశారు.