తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత ,సీఎం కేసీఆర్ కుటుంబం పాలన కోసమే తెలంగాణ రాష్ట్రం వచ్చినట్లుందని. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఎన్. రామచందర్ రావు ఆరోపించారు.
ఇవాళ ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తనను గెలిపిస్తే శాసన మండలిలో అన్ని ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వరదలపై మూడేళ్ల క్రితమే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశానని వెల్లడించారు.