తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం జీహెచ్ఎంసీ మేయర్ గా గద్వాల విజయలక్ష్మి బాధ్య తలు స్వీకరించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆమె బాధ్యతలు తీసుకున్నారు.
ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని, కె.కేశవరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి తన కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 11న జరిగిన బల్దియా మేయర్ ఎన్నికల్లో తెరాస తరఫున కార్పొరేటర్‌గా గెలుపొందిన విజయలక్ష్మి మేయర్ గా, డిప్యూటీ మేయర్ గా శ్రీలత ఎన్నికైన విషయం తెలిసిందే