హీరోయిన్ పూజా హెగ్డే కెరీర్ ప్రస్తుతం పీక్ స్టేజ్‌లో ఉంది. తెలుగులో అగ్ర కథానాయికగా కొనసాగుతున్న పూజ మరోవైపు బాలీవుడ్ నుంచి కూడా వరుస అవకాశాలు అందుకుంటోంది. భారీ పారితోషికం తీసుకుంటూ స్టార్ హీరోలతో ఆడిపాడుతోంది. ఇలా రెండు భాషల సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ముంబైలోని బాంద్రాలో ఓ ఇల్లు కొనుగోలు చేసిందట.
స్కైలైన్ వ్యూ ఉన్న త్రిబుల్ బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్‌ను పూజ ఇటీవల సొంతం చేసుకుందట. ఈ ఇంటి ఖరీదు దాదాపు రూ.20 కోట్లని తెలుస్తోంది. ఇంటీరియర్ డిజైనింగ్‌ను పూజ దగ్గరుండి చేయించిందట.
పూజ ప్రస్తుతం తెలుగులో `రాధేశ్యామ్`, `మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్`, `ఆచార్య` సినిమాలు చేస్తోంది. అలాగే హిందీలో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్ వంటి హీరోలతో ఆడిపాడుతోంది.