ఏపీలో హైవేల నిర్మా ణం, మరమ్మతులు, ఆధునీకరణకు 2021-22 బడ్జెట్‌లో రూ. 4459.52 కోట్లు కేటాయించినట్టు కేంద్ర జాతీయ రహదారుల శాఖ వెల్లడించింది.
పనులు ప్రారంభమైన రహదారులకు రూ.2,070 కోట్లు, మంజూరుకానీ ప్రాజెక్టులకు రూ.130 కోట్లు, విదేశీ సాయంతో చేపట్టే ప్రాజెక్టుకు రూ.997.94 కోట్లు, ఎన్‌హెచ్‌డీపీ కింద రూ.1261.46 కోట్లను ప్రతిపాదించినట్టు పే ర్కొంది.
కాగా, ఎన్‌హెచ్ 165పై పామర్రు-ఆకివీడు రోడ్డుకు రూ.200 కోట్లు, మడకశిర నుంచి ఏపీ-కర్ణాటక సరిహద్దు వరకు రోడ్డు విస్తరణకు రూ.100 కోట్లు కేటాయించింది.