ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీ నియంతృత్వ పోకడలు నచ్చకనే ఆ పార్టీని వీడుతున్నట్లు డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి మామయ్య శత్రుచర్ల చంద్రశేఖరరాజు తెలిపారు.
‘పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థులకు ఓటేయకపోతే పెన్షన్లు ఇళ్లు వంటి పథకాలు వర్తించవని వాలంటీర్ల ద్వారా పార్టీ నాయకులు చెప్పించారు. ఇది సరైన విధానం కాదు రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం. ఈ ప్రభుత్వ తీరుతో రాష్ట్రం అథోగతి పాలవుతోంది’ అని ఆయన అన్నారు.