బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఛత్రపతి రీమేక్ తో హిందీ ప్రేక్షకుల్ని పలకరించనుండగా.. ఇదే సమయంలో మరో తెలుగు చిత్రంలో నటించేందుకు సిద్దం అవుతున్నాడట.
కొత్త దర్శకుడు శ్రీరామ్ చెప్పిన కథ, కథానాయకుడి పాత్ర నచ్చడంతో ఆ ప్రాజెక్టుకు శ్రీనివాస్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుండగా.. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ మూవీని నిర్మించనుంది