తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణంలో రాజస్థాన్ రాళ్లను వినియోగించనున్నారు. పార్లమెంట్ లో ఉన్న ఫౌంటెయిన్ల మాదిరే ఇక్కడా ఏర్పాటు చేయనుండగా రాజస్థాన్ లోని ధోల్పూర్ రాతిని తెప్పించాలని సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
భవనం మధ్య భాగంలో బీజ్ రంగు రాతి పలకలను వినియోగించేలా నమూనాలను రూపొందించారు. రాజస్థాన్ వెళ్లి యంత్రాల ద్వారా చెక్కించిన రాతి పలకలను కాకుండా మనుషులతో చెక్కించినవి పరిశీలించాలని సీఎం సూచించారు.