దర్శకుడు శంకర్ త్వరలోనే మెగాపవర్ స్టార్ రాంచరణ్ తో ఓ మూవీ చేయనున్నాడు. ఇది శంకర్, చరణ్లకు వాళ్ల కెరీర్ లో 15వ సినిమా కాగా… ఈ మూవీని నిర్మించే శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ కు మాత్రం 50వ సినిమా.
ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందన నటించనుందని వార్తలొస్తున్నాయి. చాలా బిజీగా ఉన్నప్పటికీ శంకర్ దర్శకత్వం కావడంతో రష్మిక కూడా ఓకే చెప్పిందని తెలుస్తుండగా.. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.