లోఫర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన అందాల ముద్దుగుమ్మ దిశా పటాని . టాలీవుడ్‌లో ఈ అమ్మడికి ప్రత్యేక గుర్తింపు లభించకపోవడంతో బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తూ మంచి ఆఫర్స్ అందుకుంటుంది.
చివరిగా మలంగ్ అనే చిత్రంతో ప్రేక్షకులని పలకరించిన దిశా పటాని త్వరలో రాధే అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. కొద్ది రోజులుగా దిశా పటాని బికినీలో రెచ్చిపోతూ కుర్రాళ్ళ మనసులు దోచుకుంటుంది.
ఆ మధ్య మాల్దీవులలో బికినీతో దర్శనమిచ్చిన దిశా రీసెంట్‌గా స్విమ్మింగ్ పూల్ దగ్గర బికినీలో దిగిన ఫొటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. ఇక తాజాగా లంగా ఓణిలో మెరిసింది. ఫ్రెండ్ వెడ్డింగ్ కోసం తాను ఈ గెటప్‌లోకి మారినట్టు దిశా తన ఇన్‌స్టాలో తెలియజేసింది. ప్రస్తుతం దిశా లంగా ఓణి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి.