ప్రస్తుతం దేశంలో ఇప్పటివరకు 85 లక్షల మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం వచ్చే సైడ్ ఎఫెక్టులు చాలా తక్కువగా ఉన్నాయని కేంద్రమంత్రి హర్షవర్ధన్ చెప్పారు.
కరోనా వ్యాక్సిన్ వల్ల ఒక్కరు కూడా మరణించలేదన్న ఆయన.. దేశంలో కరోనా రికవరీ రేటు కూడా 97.29%గా ఉందని, ప్రపంచంలో అత్యంత తక్కువ కరోనా మరణాల రేటు కూడా దేశంలోనే నమోదైందన్నారు. గత 7రోజుల్లో 188 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదన్నారు.