తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1400 వైద్యుల పోస్టుల భర్తీ చేయనున్నారు. ఇందులో.. సివిల్ అసిస్టెంట్ సర్జన్ వైద్యులకు పదోన్నతుల కారణంగా ఖాళీ అయ్యే 500 పోస్టులతో పాటు ఇప్పటివరకూ భర్తీ జరగని 900 వైద్య పోస్టులు ఉన్నాయి.
తెలంగాణ వైద్య సేవల నియామక మండలి ఆధ్వర్యంలో వీటిని భర్తీ చేయాలని వైద్యశాఖ నిర్ణయించింది. ఇక నుంచి ఏడాదికి కనీసం రెండుసార్లు నియామక ప్రక్రియ జరగనుంది.