విశ్వ విఖ్యాత సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్ధులని ఎంపిక చేసే ప్రక్రియ మొదలు పెట్టారు.
పార్టీ లో చేరాలనుకునే సభ్యులు 25 వేల రూపాయలు చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందని ఆయన సోమవారం సాయంత్రం పేర్కొన్నారు. పార్టీయేతర సభ్యులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. మేలో జరగనున్న ఎలక్షన్స్ కోసం కమల్ బ్యాటరీ టార్చ్ సింబల్‌తో పోటీ చేయనున్నారు.