ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యింది. రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీ, నగర పంచాయతీలకు షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది.
దీనిప్రకారం మార్చి 10 పోలింగ్ జరుగనుండగా, అదేనెల 14న ఓట్లను లెక్కిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు రెండు రోజులపాటు సమయం ఇచ్చారు. ఈ ప్రక్రియ మార్చి 2న ప్రారంభమై 3న మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది.