డబ్బుల ఆశచూపి ఓ బాలికపై ఆఘాయిత్యానికి పాల్పడ్డాడు. స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం …ఉత్తరప్రదేశ్‌కు చెందిన దంపతులు 10 ఏండ్ల క్రితం నగరానికి వలసవచ్చి, నగరశివారు సూరారం సిద్ధ్దార్థనగర్‌లో స్థిరపడ్డారు. రోజూ వారి కూలీపనులు చేసుకుని జీవిస్తున్నారు. వారికి ఐదుగురు కూతుళ్లు, ఒక కొడుకు.
తల్లిదండ్రులు ఇద్దరు రోజూ కూలీపనులకు వెళుతుండగా.. పెద్దకూతురు(14) తమ్ముడు, చెల్లెండ్లకు కాపలా ఉంటుంది. ఈ క్రమంలో వీరి ఇంటిపక్కనే నివాసముంటున్న ప్యాబ్రికేటర్‌గా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన అక్షయ్‌లాల్(40) ఆ బాలికపై కన్ను పడింది. దీంతో బాలికకు రూ.200 ఆశచూపి శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లోకి తీసుకెళ్లి ఆఘాయిత్యానికి ఒడిగట్టాడు.
గమనించిన స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. బాధిత బాలికను వైద్యపరీక్షల కోసం ఉస్మానియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.