తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ గిరిజన సోదరులు ఎక్కువగా ఉండే జిల్లా. మన గిరిజన సోదరులకు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. గత పాలకులు చాలా సమస్యల మాదిరిగానే పోడు భూముల సమస్యను కూడా పెండింగ్‌లో పెట్టిండ్రు.
పోడు భూముల సమస్య చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. అటవీశాఖ అధికారులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నరు. నేనే స్వయంగా బయలుదేరి జిల్లాకు ఒకటిరెండు రోజులు మకాం పెట్టి ఈ పోడు భూముల సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తానని మనవి చేస్తున్నాను.
ఇప్పుడే నాగార్జునసాగర్ నెల్లికల్ లిఫ్టుకు ఫౌండేషన్ స్టోన్ వేసినా.. అక్కడి గ్రామాల ప్రజలు నాతో వారి సమస్యలు చెప్పారు. నెల్లికల్, చింతలపాలెం, ఆ చుట్టు పక్కన ఉన్నటువంటి ఐదారు గ్రామాల్లో నాలుగైదు వేల ఎకరాల భూమి వివాదం నడుస్తున్నది. రాబోయే రెండు మూడు రోజుల్లో మంత్రి జగదీశ్‌రెడ్డి స్వయంగా కూర్చొని మీకు పట్టాలు ఇస్తరు..
వాటన్నింటినీ ధరణిలోకి తీసుకొస్తరు. నెల్లికల్, చింతలపాలెం ఆ చుట్టు పక్కన గల ఐదారు గ్రామాల సమస్య రెండు మూడు రోజుల్లో తీరిపోతుంది. చింతించాల్సిన అవసరం లేదు. జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నా’ అని హాలియా బహిరంగ సభలో సీఎం కేసీఆర్ చెప్పారు.