తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హాలియాలో జరిగిన బహిరంగ సభ వేదికగా సీఎం కేసీఆర్ కొత్త రేషన్ కార్డులు,పించన్లపై శుభవార్త తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ “కరోనా వల్ల చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. నల్గొం డ జిల్లా నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్రజానీకానికి, నిరుపేదలకు నేను శుభవార్త చెబుతున్నాను.
అర్హులైన వారందరికీ కొత్త పింఛన్లు మంజూరు చేసే కార్యక్రమాన్ని త్వరలోనే చేపడుతాం. అట్లాగే కొంత మంది పెద్దవాళ్లు, ఏరువడ్డవాళ్లు (వేరు కాపురం), ఇతరత్రా కారణాల వల్ల అవసరం ఏర్పడిన వాళ్లకు నూతన రేషన్ కార్డులు కూడా మంజూరు చేస్తాం అని ప్రకటించారు..