తెలంగాణ రాష్ర్టానికి సీఎం కేసీఆరే శ్రీరామరక్ష అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు, కామేపల్లి మండలాల్లో ఎమ్మెల్యే హరిప్రియానాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, కలెక్టర్ ఎమ్వీ రెడ్డితో కలిసి మంత్రి పర్యటించారు.
ఇల్లెందులో బస్‌డిపోకు శంకుస్థాపన చేశారు. అనంతరం బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్‌పై అవాకులు, చెవాకులు పేలుతున్నారు..
ఉమ్మడి రాష్ట్రంలో భట్టి విక్రమార్క చీఫ్‌విప్, డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కాలంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాను ఏ మేరకు అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. భట్టి విక్రమార్క వాస్తవాలు తెలుసుకోకుండా విమర్శలే ధ్యేయంగా ముందుకుసాగితే ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు.