తెలంగాణలో సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లో కందులకు రికార్డు స్థాయి ధర పలికింది .
ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్ కు రూ.6 వేలు ఉంటే ట్రేడర్లు రూ.7,129 చెల్లించి కొనుగోలు చేశారు రాష్ట్రంలో ఇదే రికార్డు ధర అని అధికారులు తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మార్కెట్లో క్వింటాల్‌కు రూ.6,675, ఏనుమాములలో రూ.6,476 ధర పలికింది. సకాలంలో వానలు పడటం, వాతావరణం అనుకూలించడంతో పంట దిగుబడి పెరిగింది