కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భారత్ దూసుకెళ్తోంది ప్రపంచ దేశాలతో పోలిస్తే తక్కువ రోజుల్లో అత్యధిక టీకాలు పంపిణీ చేసిన దేశంగా భారత్ నిలిచింది.
దేశంలో ఇప్పటివరకు 60 లక్షలకు పైగా టీకాలు పంపిణీ చేశారు ఇండియాలో ఈ టీకాల పంపిణీకి 24 రోజుల సమయం పట్టింది.
అమెరికాలో 26 రోజులు, యూకేలో 46 రోజుల సమయం పట్టింది. దేశంలో సోమవారం ఒక్కరోజే 2,23,298 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.