తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి అధికార టీఆర్‌ఎస్ పార్టీ తరఫున పల్లా రాజేశ్వర్‌రెడ్డి తిరిగి పోటీ చేస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించారు.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి టీఆర్‌ఎస్ తరఫున బరిలో దిగే అభ్యర్థిని త్వరలో ఖరారు చేస్తామని చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం అందరూ కష్టపడాలని సీఎం సూచించారు.
ప్రస్తుతం రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడుగా కొనసాగుతున్న పల్లా ఎమ్మెల్సీగా వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.