సిద్దిపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. నియోజకవర్గంలోని నంగునూర్ మండలం గట్లమాల్యాలలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.22 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని, రూ.22 లక్షలతో నిర్మించిన రైతు వేదికను ప్రారంభించారు.
అదేవిధంగా రూ.9 లక్షలతో కొత్తగా నిర్మించిన గంగిరెద్దుల భవనం, రూ.7.5 లక్షతో నిర్మించిన డంప్ షెడ్డు, రూ. 60 లక్షల వ్యయంతో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ కవర్ షెడ్డును జాతికి అంకితం చేశారు.
రూ.10 లక్షలతో గ్రామ దుకాణ సముదాయాన్ని, రూ.16 లక్షలతో గ్రామ యువజన సంఘాల భవనం, రూ.2 కోట్లతో సామూహిక పాడి పశువుల వసతి సముదాయం, రూ.15 లక్షలతో ప్రభుత్వ పాఠశాలలోని అదనపు తరగతులు, రూ.10 లక్షలతో విలేజ్ హబ్ (కూరగాయల మార్కెట్)ను నిర్మించారు.