తెలంగాణ సీఎం మార్పు ఉండబోతోందంటూ జరుగుతున్న ప్రచారంపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టత ఇచ్చారు.సీఎంగా తానే కొనసాగుతానని కేసీఆర్ తేల్చి చెప్పారు.
ఆదివారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ.. కేటీఆర్‌ను సీఎం చేయబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.
సీఎంగా తానే ఉంటానని అసెంబ్లీ సాక్షిగా ఇంతకు ముందే చెప్పినా ఎందుకు మళ్లీ దాని గురించి మాట్లాడుతున్నారంటూ కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం మార్పుపై ఎవరూ మాట్లాడొద్దని మంత్రులకు, ఎమ్మెల్యేలకు చంద్రశేఖరరావు సూచించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని పేర్కొన్నారు