లాక్డౌన్ తర్వాత అందాల భామలు అందరు మాల్దీవుల బాట పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కాజల్ అగర్వాల్, సమంత, నిహారిక, ప్రణీత,దిశా పటానీ మాల్దీవులలో రచ్చ చేస్తూ అక్కడి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి తెగ వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్ సరసన సీత పాత్రలో నటిస్తున్న అలియా భట్ మాల్దీవులకు చెక్కేసింది.
ఈ మధ్య న్యూ ఇయర్ వేడుకల కోసం రాజస్థాన్ వెళ్లిన అలియా భట్ ఇప్పుడు హాలీడే టూర్లో భాగంగా మాల్దీవులకు వెళ్లింది.అక్కడ బీచ్ ఒడ్డున బికినీలో ఫొటోలకు ఫొజులిచ్చింది. ఈ ఫొటోలను చూసిన అభిమానుల గుండెల్లో గుబులు రేగుతుంది.
గతంలోను అలియా ఇలా బికినీలో రచ్చ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాలతోను బిజీగా ఉన్న అలియా భట్ త్వరలో రణ్‌భీర్ కపూర్‌తో పెళ్లి పీటలెక్కనుంది. కరోనా లేకపోయి ఉండి ఉంటే ఇప్పటి వరకు వీరిద్దరి వివాహం పూర్తి అయి ఉండేదని సన్నిహితులు అంటున్నారు.