తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 150 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,581కి చేరింది. ఇందులో 2,92,032 మంది కరోనా నుంచి కోలుకున్నారని, మరో 1610 మంది మరణించగా, 1939 కేసులు యాక్టివ్గా ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కాగా, నిన్నరాత్రి 8 గంటల వరకు 186 మంది కరోనా బారినుంచి బయటపడ్డారని, మరో ఇద్దరు బాధితులు మరణించారని తెలిపింది. మొత్తం యాక్టివ్ కేసుల్లో 808 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారని ప్రకటించింది.
దీంతో రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 97.2 శాతంగా ఉండగా, మరణాల రేటు 0.54 శాంగా ఉన్నదని తెలిపింది. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 25 కేసులు ఉన్నాయి.