2019-20 వానాకాలం ధాన్యం సేకరణలో తెలంగాణ రెండోస్థానంలో నిలిచినట్లు కేంద్ర ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి దాన్వే రావ్ సాహెబ్ పేర్కొన్నారు. పంజాబ్ నుంచి 162.33లక్షల టన్నుల ధాన్యం సేకరించింది..
తెలంగాణ నుంచి 111.26లక్షల టన్నులు సేకరించినట్లు తెలిపారు. ప్రతిఏటా ఈ పరిమాణం గణనీయంగా పెరిగినట్లు వెల్లడించారు. ఇంకా TSలో గడిచిన నాలుగేళ్ల కాలంలో 97,133 బోగస్ రేషన్ కార్డులు రద్దు చేసినట్లు దాన్వే వివరించారు.