ఏపీలో తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త వీరవెంకట సత్యనారా యణమూర్తి తెలుగుదేశం పార్టీ పదవులకు రాజీనామాలు చేశారు.
వాకలపూడిలోని తమ నివాసంలో శుక్రవారం మీడియా సమక్షంలో వారు కన్నీరు పెట్టుకుంటూ ఈ విషయం వెల్లడించారు. రూరల్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పదవికి అనంతలక్ష్మి, టీడీపీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శి పదవికి సత్యనారాయణమూర్తి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు