`కొత్త బంగారు లోకం`తో తెలుగు వారికి దగ్గరైన బెంగాళీ భామ శ్వేతాబసు ప్రసాద్. ఈ అమ్మడు సెక్స్ రాకెట్లో ఇరుక్కుని వార్తల్లో నిలిచింది. తర్వాత నిర్దోషిగా బయటకు వచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్‌ను పెళ్లి చేసుకుంది శ్వేతా బసు ప్రసాద్.
అయితే వీరి కాపురం ఎక్కువ కాలం సజావుగా సాగలేదు. ఇద్దరూ విడిపోయారు. ఇప్పుడు శ్వేతా బసు ప్రసాద్ మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఈమె `ఇండియా లాక్డౌన్` అనే సినిమాలో సెక్స్ వర్కర్ పాత్రలో నటిస్తోంది. ప్రముఖ దర్శకుడు మధుర్ బండార్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
కోవిడ్ పరిస్థితుల్లో విధించిన లాక్డౌన్ సమయంలో ముంబై రెడ్లైట్లోని సెక్స్ వర్కర్లు చాలా ఇబ్బందులను ఫేస్ చేశారు. వారి సమస్యలను తెలుసుకోవాలని అనుకున్న శ్వేతా బసు ప్రసాద్ స్వయంగా రెడ్‌లైట్ ఏరియాకు వెళ్లింది.
“నేను, మధు సర్, నా టీమ్.. రెండు వారాల క్రితం కామాటిపుర వెళ్లాం. అక్కడి వారి యాసను బట్టి ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాను. అక్కడికి వెళ్లడం లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియెన్స్“ అన్నారు.