మొత్తం 135కోట్ల జనాభా ఉన్న ఇండియాలో సుమారు 30 కోట్ల మందికి కరోనా వ్యాపించి ఉండొచ్చని ICMR సర్వేలో తేలింది. వీరిలో చాలా మందికి కరోనా వచ్చి తగ్గిన విషయం కూడా తెలియకపోవచ్చని సెరోలాజికల్ సర్వేకు చెందిన ఓ అధికారి చెప్పారు.
తగినంత రోగనిరోధక శక్తి ఉండటం వల్లే లక్షణాలు బయటపడట్లేదన్నారు. 2020 ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో 30 వేల మందిపై సర్వే నిర్వహిస్తే.. 15 మందికి ఒకరిలో కోవిడ్ యాంటీబాడీలను గుర్తించామని తెలిపారు