టీమిండియా పేసర్ అశోక్ దిండా క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని రకాల ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 36 ఏళ్ల దిండా భారత్ తరపున 13 వన్డేలు, 9 టీ20లు ఆడాడు.
అంతర్జాతీయ క్రికెట్ లో అంతగా అవకాశాలు రానప్పటికీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో రికార్డుల మోత మోగించాడు. 2005 నుంచి 2019 వరకు 420 వికెట్లు తీసి సత్తా చాటాడు. IPLలో KKR, పుణె, ఢిల్లీ, RCB తరపున ఆడాడు.