ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా టీకా పంపిణీ మలివిడత కార్యక్రమం ఇవాళ మళ్లీ ప్రారంభం కానుంది. ఇవాల్టి నుంచి పంచాయతీరాజ్, మున్సిపల్, రెవెన్యూ శాఖల్లోని ఉద్యోగులకు టీకాలు ఇవ్వనున్నారు..
కోవిన్ యాప్ లో 5.90 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు తొలి విడతలో 3.88 లక్షల మంది ఆరోగ్య సిబ్బందిలో ఇప్పటివరకు 48.90శాతం మందికి టీకాలు పంపిణీ చేయగా.. 74 మందికి మాత్రమే దుష్ఫలితాలు వచ్చాయి