తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ నగర వాసులకు త్వరలో డబుల్ డెక్కర్ బస్సులు కనువిందు చేయనున్నాయి. మరో రెండు నెలల్లో సిటీ రోడ్లపై దూసుకుపోనున్నాయి.
ప్రయోగాత్మకంగా డబుల్ డెక్కర్ బస్సులను తిప్పాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు బస్సుల కోసం టెండర్లు కూడా ఆహ్వానించింది. ఈనెల 18న ప్రీ బిడ్ నిర్వహించి, బస్సులు ఎలా ఉండాలన్న విషయాన్ని ఆ సమావేశంలో తయారీదారులకు వివరించనుంది.