దేశంలోని లబ్ధిదారుల సౌకర్యం కోసమే దేశంలో వన్ నేషన్ వన్ రేషన్ కార్డు స్కీమ్‌ను అమల్లోకి తెచ్చామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ పథకంవల్ల లబ్ధిదారుడు ఏ రాష్ట్రం, ఏ ప్రాంతానికి చెందిన వాడైనా మరే ఇతర ప్రాంతం లేదా రాష్ట్రం నుంచైనా సరుకులు తీసుకునే సౌకర్యం కలిగిందని ఆమె తెలిపారు.
ముఖ్యంగా బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే వలస కార్మికులకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతున్నదని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలోని 32 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో వన్ నేషన్ వన్ రేషన్ కార్డు స్కీమ్ అందుబాటులో ఉన్నదని ఆమె వెల్లడించారు.