తెలంగాణ రాష్ట్రంలో నేటి నుండి రేషన్ బియ్యం పంపిణీలో కొత్తవిధానం అమల్లోకి వస్తున్నది. బయోమెట్రిక్ విధానానికి బదులుగా ఓటీపీ ఆధారంగా రేషన్‌బియ్యం పంపిణీ చేయనున్నారు. కార్డుదారుల ఫోన్ నంబర్ ఆధార్‌తో అనుసంధానం తప్పనిసరికానున్నది.
అయితే ఇందులో కార్డు ఎవరి పేరు మీదైతే ఉంటుందో వారి ఫోన్ నంబరు మాత్రమే ఆధార్‌కు అనుసంధానం ఉండాల్సిన అవసరం లేదు. కార్డులో సభ్యులుగా ఉన్నటువంటి ఎవరిదైనా సరే ఫోన్ నంబర్ ఆధార్‌తో అనుసంధానం ఉంటే సరిపోతుంది.
అయితే వారే కచ్చితంగా రేషన్ షాపునకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడే ఫోన్‌కు వచ్చిన ఓటీపీ చెప్తేనే బియ్యం ఇస్తారు. ప్రభుత్వం అమలుచేస్తున్న ఈ కొత్త విధానానికి పూర్తిగా సహకరిస్తామని, లబ్దిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు అవగాహన కల్పిస్తామని రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు నాయకోటి రాజు తెలిపారు.