తెలంగాణ రాష్ట్ర వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. లింక్-1 పరిధిలోని కన్నెపల్లిలోని లక్ష్మీ పంపుహౌస్‌లో 5 పంపులతో 10,500 క్యూసెక్కుల నీటిని సరస్వతి బరాజ్‌లోకి ఎత్తిపోస్తున్నారు.
సరస్వతి పంపుహౌస్‌లో 4 మోటర్ల ద్వారా 11,720 క్యూసెక్కుల నీటిని పార్వతి బరాజ్‌లోకి ఎత్తిపోస్తున్నారు. పార్వతి పంపుహౌస్‌లో ఆరు మోటర్ల ద్వారా 12,610 క్యూసెక్కుల నీటిని ఎల్లంపల్లిలోకి ఎత్తిపోస్తున్నారు.
ఇక్కడినుంచి నంది రిజర్వాయర్‌కు.. ఇక్కడి మూడు మోటర్లతో 9,450 క్యూసెక్కుల నీటిని లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంపుహౌస్‌కు తరలిస్తున్నారు. ఇక్కడ మూడు పంపులు ఆన్ చేసి 9,450 క్యూసెక్కుల నీటిని శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్‌కు తరలిస్తున్నారు.