నమ్ముకున్న క్యాడర్ ను కంటికి రెప్పలా కాపాడుకునేదే టి ఆర్ ఎస్ పార్టీ అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.ఎంతో ముందు చూపుతో యావత్ భారతదేశంలో మొట్టమొదటి సారిగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, టి ఆర్ ఎస్ అధినేత పార్టీ సభ్యత్వానికి భీమా పాలసీ అమలులోకి తెచ్చారని ఆయన చెప్పారు.క్యాడర్ కు లీడర్ కు ఇప్పుడు అదే భరోసాగా మారిందని ఆయన స్పష్టం చేశారు.
సూర్యాపేట పట్టణానికి చెందిన సీనియర్ టి ఆర్ ఎస్ కార్యకర్త రమావత్ హరి 2019 డిసెంబర్ 8 న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే.అప్పటికే మృతుడు హరి టి ఆర్ ఎస్ సభ్యత్వం కలిగి ఉండడం తో టి ఆర్ ఎస్ అధినేత అమలులోకి తెచ్చిన భీమా పాలసీ వర్తించింది.స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి ఆదేశాల మేరకు పార్టీ యంత్రాంగం మృతుడి వివరాలతో పాటు పార్టీ సభ్యత్వం తో కూడిన వివరాలను తెలంగాణ భవన్ లోని టి ఆర్ ఎస్ కార్యాలయంలో అందజేశారు.వివరాలను పరిశీలించిన మీదట సదరు కార్యకర్త దివంగత రమావత్ హారి సతీమణి రమావత్ మొతి పేరుతో 2 లక్షల చెక్ ను మంత్రి జగదీష్ రెడ్డి కార్యాలయానికి అందజేశారు.
ఆ చెక్ ను ఈ రోజు ఉదయం దివంగత రమావత్ హారి సతీమణి రమావత్ మోతి కి మంత్రి జగదీష్ రెడ్డి చేతుల మీదుగా అంద జేశారు.ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రమాడవశత్తు జరిగే ఈ తరహా సంఘటనలతో ఆయా కుటుంబాలు వీధిన పడకుండా ఉండేందుకే టి ఆర్ ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ తరహా భీమా పధకాన్ని అమలులోకి తెచ్చారని మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు.