ఆరోగ్య భారత్ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ప్రధానమంత్రి ఆత్మనిర్బర్ స్వస్త్ భారత్ యోజన పేరుతో ఆ స్కీమ్‌ను అమలు చేయనున్నారు. ఈ కొత్త పథకం కోసం 64,180 కోట్లు ఖర్చు చేయనున్నారు.
ఆరేళ్ల పాటు ఆ స్కీమ్ కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తారు. ఆరోగ్యం విషయంలో కేంద్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇవాళ ఆమె లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు.
ఆ సమయంలో ఈ కొత్త స్కీమ్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ స్కీమ్‌లో ఉన్న నిధులతో ప్రైమరీ, సెకండరీ హెల్త్ కేర్ వ్యవస్థలను పటిష్టం చేయనున్నట్లు ఆమె చెప్పారు. ప్రస్తుతం ఉన్న జాతీయ సంస్థలను బలోపేతం చేయడమే కాకుండా.. కొత్త ఆరోగ్య సంస్థలను స్థాపించనున్నట్లు కేంద్ర మంత్రి సీతారామన్ వెల్లడించారు.