వన్ నేషన్-వన్ కార్డును ఈ ఏడాది చివరి నాటికి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. వలస కార్మికులు దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు.
కుటుంబ సభ్యులు వేర్వేరు చోట్ల ఉంటే వాటా ప్రకారం ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో వన్ నేషన్-వన్ కార్డు విజయవంతంగా అమలవుతోందని నిర్మలా చెప్పారు.