తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మంత్రి కేటీఆర్ డ్రీమ్ ఏంటో తెలుసా..?. ఏముంటది ముఖ్యమంత్రి కావడం అని మీకు మీరే ఊహించుకోకండి. అసలు మంత్రి కేటీఆర్ డ్రీమ్ ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అసలు విషయానికి వస్తే రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల గీతానగర్ లోని జెడ్పీ హైస్కూలును సీఎస్ఆర్ కింద పీపీపీ పద్ధతిలో సకల సౌకర్యాలతో అత్యద్భుతంగా మార్చారు.
కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా మారిన ఈ ప్రభుత్వ స్కూలును చూసి అంతా సూపర్ అంటున్నారు కంప్యూటర్ ల్యాబ్, ఇంటర్నెట్, వైఫై, డైనింగ్ హాల్ పుట్ బాల్, వాలీబాల్ కోర్టు వంటి సదుపాయాలు కల్పించడం జరిగింది.
దీని గురించి మంత్రి,టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ” రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లు ఇలానే ఉండాలనేది తన కల అని ఈ స్కూలు ఫోటోలతో సహా ట్వీట్ చేశారు.