కరోనా నేపథ్యంలో తొలిసారి డిజిటల్ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. స్వదేశీ ‘బాహి ఖాతా (బడ్జెట్)’ను టాబ్లెట్‌లో సమర్పించారు. పసిడి వర్ణంతో కూడిన మూడుచక్రాల జాతీయ చిహ్నంతో రూపొందించిన రెడ్ కలర్ బ్యాగ్‌లో బడ్జెట్ రూపొందించిన టాబ్లెట్‌ను తీసుకుని పార్లమెంట్‌కు వెళ్లారు.
రెడ్ అండ్ క్రీమ్ కలర్ చీర ధరించి, ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, ఇతర ఆర్థిక శాఖ అధికారులు వెంటరాగాపార్లమెంట్‌లో అడుగు పెట్టారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కొనసాగుతున్న సూట్ కేసు సంప్రదాయానికి 2019లో తెర దించిన నిర్మలా సీతారామన్.. ఎర్రటి వస్త్రంతో కూడిన సంచిలో బడ్జెట్ ప్రతిపాదనలను తీసుకొచ్చారు.